Monday, April 29, 2024

ఆది పురుష్.. ఓటీటీలోకి ఎప్పుడంటే

ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందో క్లారిటీ ఇచ్చారు ఈ మూవీ టీం. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా.. కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ సహా సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా అజయ్.. అతుల్ లు సంగీతం అందించారు. అలాగే టి సిరీస్ భూషణ్ కుమార్, ఓంరౌత్ లు అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆది పురుష్ ఓటిటి విషయమై అఫీషీయిల్ గా టీమ్ స్పందించింది. ఖచ్చితంగా ఆదిపురుష్ ని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చెయ్యండి. ఎందుకంటే ఆదిపురుష్ మూవీని థియేటర్స్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. అందులోను త్వరగా ఓటిటిలోకి వచ్చేస్తుందని భావించవద్దు.. ఆదిపురుష్ ఎనిమిది వారాల తర్వాతే అంటే ఆగష్టు సెకండ్ వీక్ లోకి ఓటిటిలోకి వస్తుంది అంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ప్రభాస్ ఆదిపురుష్ హంగామా నేడు జూన్ 14 న టికెట్ బుకింగ్ ఓపెన్ అవడంతో షురూ అయ్యింది. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాక ఆదిపురుష్ క్రేజ్ ఎంతెలా ఉందో అర్ధమైంది. టీజర్ నెగిటివిటి మొత్తం పోయి సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement