Monday, April 29, 2024

Suriya injured : షూటింగ్ లో నటుడు సూర్యకు గాయాలు

తమిళ నటుడు సూర్య కి ప్రమాదం జరిగింది. ‘కంగువా’ సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా, ఒక బరువైన కెమెరా సూర్య భుజం మీద పడినట్టుగా సమాచారం. షూటింగ్ ప్రస్తుతం నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి సమాచారం రావలసి వుంది.

‘కంగువా’షూటింగ్‌లో తమిళ స్టార్ సూర్యకు ప్రమాదం జరిగిందని, ఈ సినిమా కోసం ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఒక కెమెరా మీద పడడంతో సూర్య భుజానికి గాయం అయిందని తెలిసింది. సూర్యని దగ్గరలో వున్నా ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లారని, అలాగే షూటింగ్ ఆపివేసినట్టుగా కూడా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement