Monday, April 29, 2024

ఆకాశం నీ హద్దురా సినిమా…. మరో రికార్డు

సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ ని సాధించింది. అలాగే ఈ సినిమాలో సూర్య సరసన అపర్ణ బాలమురళి నటించింది. పరేష్ రావాల్, మోహన్ బాబు, ఊర్వశి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళంలో సూరరై పోట్రు పేరుతో తెరకెక్కింది.

అయితే ఈ చిత్రం గతంలో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. ఇక ఇప్పటికే చాలా రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. అక్టోబర్ 30 నుంచి ఆకాశం నీ హద్దురా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రైమ్ వీడియో అవార్డ్స్ 2021లో బెస్ట్ మూవీగా రికార్డుకెక్కింది. ప్రేక్షకుల ఔట్ బాక్స్ ఎక్స్ పీరియన్స్ వచ్చిన ఇచ్చిన బజ్, వ్యూస్ ద్వారా ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement