Sunday, April 28, 2024

ఏ మాస్ట‌ర్ పీస్.. ఈ ఏడాది థియేట‌ర్ లో క‌లుద్దాం.. లుక్ రిలీజ్

తెలుగు సూప‌ర్ హీరో మూవీగా వ‌స్తున్న చిత్రం ఏ మాస్ట‌ర్ పీస్. ఈ చిత్రానికి సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా అర‌వింద్ కృష్ణ న‌టిస్తున్నారు.. ఈ మూవీ నుండి మ‌రో లుక్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. నేనేంటో, నేనెవరో ఇదే.. గేమ్‌ ఆన్‌.. ఈ ఏడాది థియేటర్లలో కలుద్దాం.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ సూపర్ మ్యాన్ అవతార్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం అషు రెడ్డి ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీకాంత్‌ కండ్రగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ కృష్ణ మరోవైపు వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో అండర్ వరల్డ్‌ బిలియనీర్స్ లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement