Tuesday, April 30, 2024

వాలెంటైన్స్ డేకి రీ-రిలీజ్ కానున్న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ

రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పుడు ఇతర పరిశ్రమలలో కూడా వ్యాపించింది. తెలుగులో మొద‌ట‌ రీ-రిలీజ్ అయిన‌ పోకిరితో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా రీ-రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. సిద్ధార్థ్, త్రిష కృష్ణన్, ప్రధాన పాత్రలు పోషించిన‌ ఈ రొమ్-కామ్‌ను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సినీ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా 9 భాషల్లోకి రీమేక్ అయింది. అంతే కాకుండా ఈ మూవీ తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, ఐదు నంది అవార్డులను అందుకుంది. నిర్మాత ఎం.ఎస్. రాజు, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement