Thursday, May 2, 2024

7డేస్…6 నైట్స్ – ఎం. ఎస్ రాజు న్యూ మూవీ

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు డర్టీ హరి సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు వసూళ్ళ పరంగా కూడా బాగానే రాబట్టింది. అయితే ఇప్పుడు అదే ఉత్సాహంతో మరో సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు ఎం. ఎస్ రాజు. ఈరోజు ఎం. ఎస్ రాజు పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం 7 డేస్, 6 నైట్స్ చిత్రం టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

వైల్డ్ హానీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ రజినీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని ఎం.ఎస్.రాజు అన్నారు. డర్టీ హరి సినిమాను మించి ఈ సినిమా ఉంటుందని జూన్ 7న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement