Friday, May 3, 2024

ర‌ద్దీ లేక‌పోవ‌డంతో క‌నులారా శ్రీవారిని వీక్షిస్తున్న భ‌క్త జ‌నం

తిరుమల, : కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత కొద్ది రోజులుగా గణనీయంగా తగ్గిపో యింది. గత మూడు రోజులుగా ప్రతినిత్యం 5 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ బాగా తక్కువగా ఉండడంతో డైరెక్ట్‌ క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని తనివితీరా దర్శించుకుని భక్తులు సంతృప్తి చెందుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ సప్తగిరులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన టీటీడీ శ్రీవారి దర్శనాల సంఖ్యను బాగా కుదించి ప్రస్తుతం కేవలం 20 వేలమంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శంచుకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, మరి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కఠిన ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంతో పాటు నానాటికి దేశ వ్యాప్తంగా కేసులు రికార్డు స్థాయిలో నమాెెదు అవుతుండడంతో శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. టీటీడీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో రోజుకి 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయగా, ఇక విఐపి బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, సుపథం ఎంట్రీ, వర్చువల్‌ అర్జీత సేవా టికెట్లు కలిగిన భక్తులు ఇలా మరో 5 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నప్పటికీ ప్రస్తుతం నిత్యం 4 వేల నుంచి 6 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక నిన్నటి నుంచి ఏపిీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫూ ఆం క్షలు అమలులో ఉండడంతో ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను పూర్తీగా నిలిపివేయడంతో పాటు అంతర రాష్ట్ర రవాణాను కూడా ఈ సమయాలలో పూర్తిగా నిషేదించడంతో భక్తుల రాక మరింత తగ్గింది. దీంతో ప్రస్తుతం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వస్తున్న భక్తులు కేవలం 15 నుంచి 30 విమిషాలలోనే శ్రీవారిని తనివి తీరా దర్శించుకని తన్మయత్వం చెందుతూ దివ్యానుభూతికి లోనౌతున్నారు. నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన కర్ఫూ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలలో ఉదయం 11.30 గంటల వరకు దర్శనాననికి భక్తులను అనుమతిస్తూ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకోగా, తిరుమలలో మాత్రం టిటిడి దర్శనాల సమయాన్ని కుదించలేదు. ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు టిటిడి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు అలిపిరి వద్దకు చేరుకుంటే వారిని తిరుమలకు అనుమతించడంతో పాటు భక్తులు సౌకర్యార్దం తిరుమల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసి బస్సులను నడిపేవిధంగా చర్యలు తీసుకుంది. కర్ఫూనేపథ్యంలో తిరుమలలో మధ్యాహనం 12 గంటల నుంచి పోలీసులు దుకాణాలను మూసివేయిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి తిరుమలలో నిర్మాణుష్య వాతావరణం కనిపిస్తున్నది సాధారణంగా టీటీడీ ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తే 24 నుంచి 48 గంటలలో అన్ని టికెట్లు అమ్ముడు పోతుండగా, మే నెలకు సంబంధించి టికెట్ల కోటాను నిత్యం 30 వేల నుంచి 15 వేలకు తగగ్గించి భక్తులకు అందుబాటులో ఉంచినా నేటికి 30 శాతం టికెట్లను మాత్రమే భక్తులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకునే భక్తులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే తనివితీరా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే భాగ్యం దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement