Thursday, May 2, 2024

‘సల్మాన్’ కి థ్యాంక్స్..’రాఖీ సావంత్..జయ’

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల క్యాన్సర్ కి చికిత్స పొందుతున్న నటి రాఖీ సావంత్ తల్లి జయ క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాఖీ సావంత్ తల్లి సల్మాన్ తో పాటు ఆయన సోదరుడు సోహెల్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు.  త‌న తల్లి మాట్లాడిన వీడియోని రాఖీ సావంత్ త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ  స‌ల్మాన్ ఖాన్, బిగ్ బాస్ 14ల‌ను  ట్యాగ్ చేసింది. ఇటీవ‌ల రాఖీ సావంత్ త‌న త‌ల్లి ఆసుప‌త్రి ఖ‌ర్చుల కోసం స‌ల్మాన్ అత‌ని సోద‌రుడు సోహైల్ వైద్య ఖ‌ర్చుల‌కు సాయం చేస్తున్నార‌ని తెలిపింది. స‌ల్మాన్ ఖాన్ ఎక్కు సాయం అందించ‌గా, ఆయ‌న మాకు దేవ‌దూత అని పేర్కొంది. సోద‌రులిద్ద‌రు డాక్ట‌ర్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ చికిత్సకు సంబంధించిన వివ‌రాలు తెలుసుకున్నారు. స‌ల్మాన్ సార్ లాంటి సోద‌రుడు మాకు దొర‌క‌డం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్  చెప్పింది.  రాఖీ ఇటీవ‌ల బిగ్ బాస్ 14 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా,  ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్ ఎపిసోడ్ లో  ఆమె రూ. 14 లక్షల మొత్తంతో ప్రదర్శన నుండి బయటకు వచ్చింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement