Monday, April 29, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి బిజెపి అగ్ర‌నేత‌లు…

హైదరాబాద్‌, : శాసనమండలి పట్ట భద్రుల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఎట్టి పరిస్థితులలో గెలవాలన్న కృత నిశ్చ యంతో ఉన్న నాయకత్వం శక్తియుక్తులను ఒడ్డేందుకు సన్నద్దమవు తోంది. గ్రేటర్‌ ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలను కూడా ప్రచారంతో హోరెత్తించాలని, వీలైనంత ఎక్కు వ పర్యాయాలు నేతల పర్యటనలు ఉండేలా ప్రణాళి కలను సిద్దం చేస్తున్న పార్టీ యంత్రాం గం అన్ని స్థాయి లలోని నేతలు, కార్యకర్తలకు బాధ్యతలను అప్ప గిస్తోంది. సభలు, సమావేశాలు, ఇష్టా గోష్టులు, చర్చా గోష్టులతో ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వీటితో పాటు గ్రేటర్‌ ఎన్నికల సందర్భం గా ప్రచారంలో పాల్గొన్న వారిలో చాలా మంది కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలను రప్పించాలని నిర్ణయించింది. ఒక్కో మంత్రి ఒక్కో అంశంపై పట్టభద్రులలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వదులుకోవడం, ఎంఎంటీఎస్‌ లాంటి పథకాలను రాష్ట్ర వాటాను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాళేశ్వరం లాంటి పలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి అందిం చకుండా గోప్యంగా ఉంచడం, విద్యుత్‌ ఒప్పందాలలో అక్రమాలు, విద్యా విధానంపై నిర్లక్ష్యం వహించడం వల్ల కలిగిన నష్టం, యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా కాల యాపన చేయడం, బోధనా, బోధనేతర సిబ్బందిని నియమించక పోవడం వల్ల రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు న్యాక్‌ గుర్తింపును కోల్పోవడం, న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందడం, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మభ్యపెట్టి పబ్బం గడుపుతుండటం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి దాదాపు నాలుగేళ్ళు కావస్తున్నా ఇంత వరకు ఆయా జిల్లాలలో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేయకపోవడం, ఐటీ పేరుతో యువతను మభ్యపెట్టడం, హైదరాబాద్‌ నగరంలో ఎంఎంటీ ఎస్‌ను అర్ధాంతరంగా నిలిపి వేయడం, కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి పలు అంశాలను కూలం కషంగా మేధావులు, విద్యావేత్తలు, యువతకు తెలియజేసేలా యోజన చేస్తున్నారు.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కుమార్తెను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దింపడంతో ఆయనకు కాం గ్రెస్‌ చేసిన అన్యాయం, బీజేపీ అధికారంలోకి వచ్చాక తీసు కున్న చర్యలను వివరించ డంతో పాటు కేంద్ర మంత్రిగా కేసీఆర్‌ ఉన్న సమయంలో పీవీ పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో చెప్పాలన్న ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని పార్టీ నిర్ణయించింది. ప్రచారంలో కేంద్ర మంత్రులు, ఆయా రంగాలలో నిపుణులను రంగం లోకి ప్రచారా న్ని హోరెత్తించేందుకు సన్నద్దమవు తున్నారు.
ఇప్పటి వరకు పార్టీ నేతలు చెబుతున్న ప్రకారం ప్రచారానికి వచ్చే వారిలో కేంద్ర మంత్రులు ప్రకాష్‌ జావదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, స్మృతి ఇరానీలతో పాటు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలతో పాటు మరికొంత మందిని రప్పించాలని నిర్ణయించారు. ఇందులో కొంత మంది సుముఖత తెలిపారని పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ పట్టభద్రుల నియోజక వర్గాలలో నేతల సుడిగాలి పర్యటనలు ఉంటాయని చెప్పారు. వీరితో పాటు అధికార టీఆర్‌ఎస్‌ నేతల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేందుకు సోషల్‌ మీడియా వింగ్‌ను కూడా పటిష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement