Friday, April 26, 2024

‘శ్రీకారం’ టీజర్ రిలీజ్ చేసిన ‘మహేశ్ బాబు’

శ్రీకారం చిత్ర టీజర్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కిశోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న శ్రీకారం టీంకు ఆల్ ది బెస్ట్..అంటూ టీజ‌ర్ ను అంద‌రితో పంచుకున్నాడు మ‌హేశ్‌. ఓ హీరో త‌న కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకును డాక్ట‌ర్. .ఒక ఇంజినీర్ త‌న కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం త‌న కొడుకును రైతును చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టి నాకు జ‌వాబు లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది..అంటూ శ‌ర్వానంద్ చెప్పే సంభాష‌ణ‌ల‌తో సాగే టీజ‌ర్ అంద‌రినీ ఆలోచింప‌జేసేలా ఉంది.  వాస్త‌వ ఘ‌ట‌న‌ల స‌మాహారంతో వ్య‌వసాయం ప్రాధాన్యాన్ని తెలియ‌జేస్తూ రూపొందిస్తున్న శ్రీకారం అంద‌రినీ అల‌రించ‌డం ఖాయ‌మ‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గావ‌స్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తుంది. 14  రీల్స్ ప్ల‌స్‌  బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ  సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement