Sunday, April 28, 2024

విజయ్ దేవరకొండతో ‘సారాఆలీఖాన్’ సెల్ఫీ

యంగ్ హీరో విజయ్ దేవరకొండతో బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీఖాన్ సెల్ఫీ తీసుకుంది.పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌తో బాలీవుడ్‌లోనూ స‌త్తా చాటాల‌ని చూస్తున్నాడు  విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే అత‌డు అక్క‌డ అడుగుపెట్ట‌క ముందే.. ఓ కొత్త అభిమానిని సంపాదించుకున్నాడు. ఆమె సాదాసీదా వ్యక్తి కాదు. బాలీవుడ్ బ్యూటీ, స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌. విజ‌య్‌తో తాను దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌ స్టేట‌స్‌లో పెట్టుకున్న ఆమె.. ఫ్యాన్ మూమెంట్ అంటూ మురిసిపోయింది. పూరీ జ‌గన్నాథ్‌ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న లైగ‌ర్‌తో విజ‌య్ బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement