Sunday, April 28, 2024

ర్యాప్ సాంగ్ కి 5కోట్ల 10లక్షల వ్యూస్

ఓ ర్యాప్ సాంగ్   యూట్యూబ్ సహా డిజిటల్లో వైరల్ అవుతోందిప్పుడు.  ‘బెస్ట్ ఫ్రెండ్’ అనేది అమెరికన్ రాపర్ సావీటీ పాట. డేవ్ మేయర్స్ దర్శకత్వం వహించిన మ్యూజిక్ వీడియో ఇది. 7 జనవరి 2021 న ‘ప్రెట్టీ బిచ్ మ్యూజిక్’ నుండి మూడవ సింగిల్ గా విడుదలైంది. సావీటీ తొలి స్టూడియో ఆల్బమ్ ఇది.  ఈ పాటలో అమెరికన్ గాయని  రాపర్ డోజా క్యాట్ ఉన్నారు. దీనిని డాక్టర్ లూకా – రోకో సంయుక్తంగా నిర్మించారు. ఇదే పాట 4 డిసెంబర్ 2020 న స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లపై ‘బెస్ట్ ఫ్రెండ్’ తనకు తెలీకుండా విడుదల చేయడంతో సావీటీకి తీవ్ర నిరాశ ఎదురైంది. నేను ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న ఒక సింగిల్ ను ముందస్తుగా విడుదల చేసినందుకు నేను చాలా నిరాశకు గురయ్యాను. నేను దీనిని అగౌరవంగా భావిస్తున్నాను. నేను నా సృజనాత్మకతతో చేతులు కలిపే టైమ్ వచ్చేసింది అని సావీటీ సొంత స్టూడియోని ప్రారంభించింది. బెస్ట్ ఫ్రెండ్ ఈ ఏడాది జనవరి 7న డిజిటల్ డౌన్ లోడ్ స్ట్రీమింగ్ కోసం అధికారికంగా విడుదల చేసారు. ఈ ట్రాక్ 12 జనవరి 2021 న యునైటెడ్ స్టేట్స్ లో మకాలీన హిట్ రేడియో .. రిథమిక్ సమకాలీన రేడియో లోనూ టెలీకాస్ట్ చేశారు.ఈ వీడియోలో సావీటీ- డోజా క్యాట్ డ్యాన్సులకు ఉర్రూతలూగాల్సిందే. వీటిలో బెడ్ జజ్డ్ టెస్లా ముందు డ్రైవింగ్.. హీటెక్కించే పోజులివ్వడం.. అలాగే ఒక కొండపై నుండి సముద్రంలోకి దూకే గ్రేట్ ఫ్రెండ్స్ ఫీట్ ఇవన్నీ ఇలైట్. 3 నిమిషాల ఈ వీడియో ఆద్యంతం మెరుపులే మెరుపులు. అందుకే కేవలం నెలరోజుల్లోనే ఈ వీడియోని 5కోట్ల 10 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికీ అదే స్పీడ్ తో అంతర్జాలంలో దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement