Tuesday, May 21, 2024

మా కష్టాలు చూశారా అంటోన్న ‘రవి’

మేము పడుతోన్న కష్టాలు ఇవేనంటున్నాడు యాంకర్..నటుడు రవి. తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు సంబంధించిన విష‌యాల‌ను యాంకర్..నటుడు ర‌వి వీడియో ద్వారా తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  ఇప్పుడు స‌మ‌యం ఉద‌యం గం.4.37ని.లు.  షూటింగ్ ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైంది. ఇప్ప‌టికి కొన‌సాగుతుంది.  మీరు మా మీద చూపించే ప్రేమతో దీన్ని పోల్చ‌లేము. అయితే మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఎంతగా క‌ష్ట‌ప‌డుతున్నారో చూడండి. యాంక‌ర్ వ‌ర్షిణి నిద్ర‌పోతుండ‌గా.. సీరియ‌ల్ న‌టులు సుహాసిని, న‌వ్య స్వామి, ర‌వికృష్ణ‌, అర్జున్ అక్క‌డ ఉన్నారు. మేమంద‌రం ఇంత క‌ష్ట‌ప‌డి చేస్తుంటే కొంద‌రేమో ఏం బాగుందిరా అంటారు అని ర‌వి త‌ను షేర్ చేసిన వీడియోలో చెప్పడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement