Sunday, May 19, 2024

ప్రకృతిలో పరవశిస్తున్నా..భాగశ్రీ

సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్  మీడియా ద్వారా అభిమానులను పలకరించే ఈ బ్యూటీ ప్రైడే పోస్టుతో నెటిజన్ల ముందుకి వచ్చింది. వైట్ స్లీవ్‌లెస్ లాంగ్ డ్రెస్‌లో బాల్క‌నీలో నుంచి స‌ముద్ర తీర ప్రాంత గాలుల‌ను ఆస్వాదిస్తున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 5 ప‌దుల వ‌య‌స్సులోనూ భాగ్య‌శ్రీ మేక‌ప్ లేకుండా కుర్ర‌హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీనిచ్చే అందంతో చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోలు ఇపుడు ఇంట‌ర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి. భాగ్యశ్రీ న‌వ్వుతుండ‌గా తీసిన వీడియోకు పీస్‌ఫుల్ మ్యూజిక్ ను యాడ్ చేయ‌గా..ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. నేను నా జీవితంలో మరో సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు, నా జీవితంలోని ప్రజలందరితో, వస్తువులతోనే కాకుండా గాలి, సముద్రం, సూర్యుడు, పర్వతాలు, పువ్వులు …ఇంకా చాలా..అన్నిటితోనూ కృతజ్ఞతతో నిండి ఉన్నాను.. అని క్యాప్ష‌న్ ఇచ్చింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement