Monday, May 20, 2024

జర్నలిస్టుగా ‘ప్రియదర్శి’

కమెడియన్ గా..హీరోగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనదైన నటనని ప్రదర్శిస్తున్నాడు ప్రియదర్శి. ఇప్పుడు ప్రముఖ జర్నలిస్టు పాత్రలో మెరవనున్నాడట. ఈ మధ్య రోజులలో బాగా కాంట్రవర్సీలలో చిక్కుకుని, చివరికి జైలుకు కూడా వెళ్ళి వచ్చిన జర్నలిస్టు రవిప్రకాష్ పాత్ర. టీవి9 రవిప్రకాష్‌గా గుర్తింపు పొందిన రవిప్రకాష్ పాత్రను ప్రియదర్శి చేసినట్టుగా టాక్. అయితే మరి ప్రియదర్శి చేస్తున్న పాత్రల నమూనాను పరిశీలిస్తే చాలా వరకూ ఎంటర్టైనింగ్ ఉండే పాత్రలే చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా ప్రియదర్శి చేస్తున్నది ఓ జర్నలిస్టు పాత్ర. రవిప్రకాష్ లైఫ్‌ని ఆధారం చేసుకుని సృష్టించినదని అంటున్నారు. మరి ప్రియదర్శి చేస్తున్న పాత్రలకీ, మోస్ట్ కాంట్రవర్షియల్ వ్యక్తిగా ఇటీవలి రోజులలో పేరుపడ్డ రవిప్రకాష్ పాత్రకి దర్శకుడు ఎలా పొంతన కలిపాడో తెరమీద చూడాల్సిందే అంటున్నారు సన్నిహితవర్గాలు. ఏది ఏమైనా సరే ప్రియదర్శికి మాత్రం ఇదొక ఛాలెంజే. ఈ పాత్ర గురించి చెబుతూ.. చాలా ఇంట్రస్టింగ్ పాత్ర అని, చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని మాత్రం ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట ప్రియదర్శి.

Advertisement

తాజా వార్తలు

Advertisement