Saturday, April 27, 2024

‘గాలిసంపత్’ ఫస్ట్ సాంగ్

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న చిత్రం గాలిసంపత్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.  రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తూనే స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గాలిసంపత్ నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘ఫిఫిఫీ ఫిఫిఫీ’ అంటూ సాగే ఈ కామెడీ ఎంటర్టైనింగ్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. పోటుగాడు కరెంటుతీగ మూవీస్ ఫేమ్ అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మంచి మెలోడీ సంగీతానికి సరిపోయే లిరిక్స్ పడితే ఎలా ఉంటుందో అలాంటి లిరిక్స్ అందించాడు రామజోగయ్యశాస్త్రి. మార్చి 11న తెరమీదకు రాబోతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ ఇమేజ్ స్పార్క్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement