Saturday, May 4, 2024

కఠినమైన వర్క్ వుట్

టైం ఉన్నా..లేకపోయినా తన జీవితంలో ఓ భాగమైపోయాయి వర్క్ వుట్స్. నిత్యం జిమ్ లో గడిపేందుకు ఇష్టపడుతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ వర్కవుట్లకు సమయం కేటాయిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వర్క్ వుట్ వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో యోగా కూడా ప్రారంభించింది. కష్టతరమైన ఆసనాలు వేస్తోంది. వాటిని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తన వర్కవుట్ వీడియోను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్లిష్టమైన ఆ వర్కవుట్‌ను రకుల్ సునాయాసంగా చేసేసింది. దీంతో నెటిజన్లు రకుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన చెక్ సినిమాలో రకుల్ కీలక పాత్రలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement