Wednesday, May 15, 2024

‘ఎఫ్3’ రెండో షెడ్యూల్ కంప్లీట్

దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్3 చిత్రాన్ని చాలా ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్నాడట.  ఈ సినిమాను గత డిసెంబర్లో మొదలుపెట్టాడు అనిల్. ఆగస్టు 27న విడుదల చేస్తామంటూ ఇప్పటికే ప్రకటన చేశారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాడు అనిల్. ఇప్పటి వరకు వరుసగా 5 విజయాలు అందుకున్న ఈ దర్శకుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. గత 20 ఏండ్లలో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి. ఆయన రికార్డు అనిల్ రావిపూడి అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన చేస్తున్న ఎఫ్ 3 షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్. అందులో వెంకటేష్, వరుణ్ తేజ్, మెహరీన్ , తమన్నా, సునీల్, సీనియర్ నటులు ప్రదీప్, అన్నపూర్ణమ్మ, వై విజయ, రఘు బాబు కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement