Monday, April 29, 2024

అనిరుధ్ తో లవ్ లో ‘కీర్తి సురేష్’ నిజమేనా..!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉందట హీరోయిన్ కీర్తి సురేష్.  త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌రగ‌నుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అనిరుధ్ ప్రముఖ గాయని జోనీతాగాంధీతో పీకల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని కోలీవుడ్ మీడియా చెబుతుండగా, ఇప్పుడు ఆయ‌న కీర్తి సురేష్‌ను వివాహం చేసుకోనున్నాడంటూ కొత్త వార్త‌లు పుట్టుకు రావ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఈ వార్త‌ల‌పై పూర్తి క్లారిటీ రావాలంటే అనిరుధ్ కాని, కీర్తి కాని స్పందించి తీరాల్సిందే. అనిరుధ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట‌ర్ చిత్రానికి సంగీతం అందించాడు అనిరుధ్.  ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న  కమాండర్ 65 చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement