Friday, May 17, 2024

‘అజిత్’ సైకిల్ ట్రిప్

సైకిల్ తో హైదరాబాద్ రోడ్లపై కనిపించారు తమిళ స్టార్ హీరో అజిత్. తమిళ స్టార్ హీరో అజిత్ కి లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం అంటే మహా సరదా. బైక్..కార్లే కాదు సైకిల్ పై కూడా ఈయన వెళుతుంటారు. ప్రస్తుతం అజిత్ కోల్ కతా వరకు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా అజిత్ తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఆయనని  ఎవరూ గుర్తు పట్టకుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించి హైదరాబాద్ రోడ్లపై విహరించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో వలిమై సినిమా చేస్తున్నారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజిత్ పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా కనిపించనున్నాడు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement