Saturday, May 18, 2024

‘అజిత్’ వీరాభిమాని సూసైడ్

తమిళ స్టార్ హీరో అజిత్ అభిమాని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. అజిత్ ని అమితంగా అభిమానించే ప్రకాశ్ అనే అభిమాని సూసైడ్ చేసుకోవడం కోలీవుడ్ లో విషాదాన్ని నింపింది. అజిత్ ని ఎంతగానో ఇష్టపడూ ప్రకాశ్ ఒంటి నిండా అజిత్ కి సంబంధించిన టాటూలే ఉన్నాయి. అజిత్‌కు సంబంధించిన ఏ వేడుక‌లో అయిన అత‌ను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏం జ‌రిగిందో కాని అత‌ను ఫిబ్ర‌వ‌రి 24న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని  అజిత్‌ కుమార్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అజిత్ వీరాభిమానిని కోల్పోయాం. అత‌ని కుటుంబాన్ని ఆదుకోవాల‌ని, వారి అవ‌స‌రాల‌కు అండ‌గా ఉండాల‌ని ద‌గ్గ‌ర‌లో ఉన్న అజిత్ ఫ్యాన్స్‌ను కోరుతున్నాం. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం అని ఫ్యాన్ క్ల‌బ్ తమ ట్వీట్‌లో పేర్కొంది. అయితే అజిత్ అభిమాని సూసైడ్ చేసుకొని మ‌ర‌ణించాడ‌ని తెలుసుకున్న నెటిజ‌న్స్   ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement