Friday, May 3, 2024

‘ప్రియాంక’ న్యూ ఫ్యాషన్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కొత్త డ్రెస్ తెగ వైరల్ అవుతోంది.  ఊహించని డ్రెస్సులలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. గోళాకారం వంటి డ్రెస్ ధరించిన ప్రియాంక చోప్రా అందరికి షాక్ ఇచ్చింది. గోళాకారం వంటి డ్రెస్ ధరించిన ప్రియాంక అదే డ్రెస్ లో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది నిమిషాలో వైరల్ అయ్యాయి. నెటిజ‌న్స్ అయితే   ఆటో హారన్ నుంచి.. పోకే మాన్ వరకు అన్ని రకాల మీమ్స్ తో హడావుడి చేసేశారు.చివ‌ర‌కు భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. బంతిలా ఉన్న ప్రియాంక చోప్రాను విరాట్ కోహ్లీ క్యాచ్ ప‌డుతున్న‌ట్టు మీమ్ త‌యారు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ప్రియాంక వెరైటీ డ్రెస్ ఎంత హాట్ టాపిక్ అయిందో, ఆమెపై చేసిన మీమ్స్ కూడా అదే విధంగా హెడ్ లైన్స్‌లో నిలుస్తున్నాయి. అయితే త‌న‌పై క్రియేట్ చేసిన మీమ్స్‌పై ప్రియాంక పాజిటివ్‌గా స్పందించ‌డం కొస‌మెరుపు. కాగా, అన్ ఫినిషిడ్‌ పేరుతో ప్రియాంక చోప్రా ఆత్మకథ రాయ‌గా, ఇది వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement