Monday, April 29, 2024

Elon musk | ఎవ్రీథింగ్ యాప్‌గా X .. ఇక నుంచి ఉద్యోగ దరఖాస్తులు కూడా !

ఎలోన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ (ట్విట్టర్‌) X ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుండి అనేక మార్పులు చేస్తూ.. కొత్త కొత్త ఫీచర్లు తీసువస్తున్నారు. ఇటీవల ఆడియో/వీడియో కాల్ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఉద్యోగాలు కల్పించే వేదికగా ఎక్స్‌ను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అందుకొసం X ప్లాట్‌ఫారమ్ ఒక ఫీచర్‌ను జోడించింది. దీంతో కొన్ని సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌‌తో.. ఉద్యోగ సమాచార అందించే లింక్డ్‌ఇన్‌తో పోటీ పడనుంది. జాబ్ సెర్చ్‌లోని ఫిల్టర్ ఫీచర్ పైన కంపెనీ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement