Sunday, May 5, 2024

Vivo X100 Pro | వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే !

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో త‌మ కంపెనీ నుంచి కొత్త ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ కానుంది. కాగా, ఈ సిరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫోన్ ఈ నెల 13న మొదట చైనా మార్కెట్‌లో లాంచ్ చేయనుంది కంపెనీ. ఈ తరువాత భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేస్తారు. వివో ఎక్స్100తోపాటు వివో ఎక్స్100 ప్రో, వివో వాచ్3 కూడా ఆవిష్కరిస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్, జెయిస్ బ్రాండ్ కెమెరాలు, వీ2 ఇమేజింగ్ చిప్‌తో మార్కెట్లోకి వస్తున్నట్లు ధ్రువీకరించారు.

ఇక ఈ ఫోన్‌లో బేస్ మొడల్ వివో X100, వివో X100 ప్రో, వివో X100 ప్రో ప్లస్, స్మార్ట్‌ఫోన్‌ల కీలక ఫీచర్లు గతంలో లీకయ్యాయి. వివో X100 మోడల్ మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. 12GB + 256GB, 16GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB ఫోన్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 45,600) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్100 ప్రో ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో వస్తుందని తెలుస్తొంది. కెమెరా ఐలాండ్‌పై ఎల్ఈడీ ఫ్లాష్ ఏర్పాటు చేస్తారు. 1-అంగుళం మెయిన్ కెమెరా ఉంటుంది.వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్ 6.78-అంగుళాల (1260×2800 పిక్సెల్స్) అమోలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్ ప్లే కలిగి ఉంటది. 50 వాట్ల వైర్ లెస్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4870 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement