Sunday, May 5, 2024

100కోట్ల గోల్డ్‌ లోన్‌ రుణాల టర్నోవర్‌.. నవెూదు చేసిన ఆగ్మాంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : భారతదేశం నెం.1 గోల్డ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆగ్మాంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌ వారి మొదటి సంవత్సరంలో 100కోట్లకు పైగా బంగారు రుణాల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఆగ్మాంట్‌ అనేది రిఫైనింగ్‌ నుండి రిటైలింగ్‌ వరకు పూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ గోల్డ్‌ ప్లేయర్స్‌. దీని ప్లాట్‌ఫారం గోల్డ్‌ ఫర్‌ ఆల్‌ బంగారానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను అందిస్తుంది. ఆగ్మాంట్‌కు ఎన్‌ఏబీఎల్‌ అక్రిడిటేషన్‌, బీఐఎస్‌ హాల్‌ మార్క్‌, ఐడీబీఐ ట్రస్టీషిప్‌ కలిగి ఉంది. నాణ్యతా భరోసా, కస్టమర్లకు ఎలాంటి రిస్క్‌ లేదు. 2021లో డన్‌ అండ్‌ బ్రాడ్‌ స్ట్రీట్‌ చే భారతదేశంలో టాప్‌ 150 అన్లిస్టెడ్‌ కంపెనీలలో ఆగ్మాంట్‌ స్థానం పొందింది.

ఆగ్మాంట్‌ కస్టమర్లు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చు. అలాగే తమ బంగారు ఆభరణాలపై రుణాలను కూడా పొందవచ్చని ఆసంస్థ తెలిపింది. సాంకేతిక యుగంలో, గోల్డ్‌ టెక్‌ కంపెనీ పాన్‌ ఇండియాలో తమ ఉనికిని పెంచుకుంది. ఆగ్మాంట్‌ వారి ఉత్పత్తి ఆవిష్కరణ రూపకల్పన, సేవకు సంవత్సరాలుగా బహుళ అవార్డులను గెలుచుకుందని ఆసంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement