Thursday, May 2, 2024

50 వేల మార్క్‌ చేరిన టాటా ఈవీ… వచ్చే 5ఏండ్లలో 10 కొత్త ఈవీలకు ప్లాన్‌

టాటా మోటార్స్‌ విద్యుత్‌ వాహనాల విషయంలో 50 వేల మైలురాయిని అధిగమించింది. కంపెనీ పూణే ప్లాంట్‌ నుంచి ఇవ్వాల (సోమవారం) 50 వేల టాటా ఈవీ నెక్సాన్‌ కారును విడుదల చేసింది. దేశంలో అందుబాటు ధరలోనే టాటా కంపెనీ కస్టమర్లకు ఈవీ కార్లను అందించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అభిమానాన్ని టాటా ఈవీ వాహనాలు పొందాయని ఆయన చెప్పారు. అనతి కాలంలోనే 50వేల వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడం ఈ రంగంలో కంపెనీ పట్టుకు ప్రతీక అని ఆయన అభిప్రాయపడ్డారు.

టాటా ఈవీ కార్ల యజమానుల పాజిటివ్‌ మాటలు, అందుబాటు ధర,బెటర్‌ రైడింగ్‌ అనుభవం, ఆధునిక సదుపాయాలు ఇలా అనేక విధాలుగా కస్టమర్లను తమ కంపెనీ కార్లు ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. టాటా మోటార్స్‌ విద్యుత్‌ వాహనాల రంగంలో ప్రస్తుతం అగ్రగామిగా ఉంది. సెప్టెంబర్‌ నెలలో కంపెనీ 8.49 లక్షల ప్రారంభ ధరతో టియాగో కారును విడుదల చేసింది. ఇది కూడా కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో కంపెనీ 10 ఈవీ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానుందని శైలేష్‌ చంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement