Friday, April 19, 2024

రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణ, హౌజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీ చైర్మ‌న్లు ఎవ‌రంటే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యసభ స్టాండింగ్ (హౌజ్) కమిటీల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎథిక్స్ కమిటీకి మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ఛైర్మన్‌గా నియమించారు. చైర్మన్‌ సహా మొత్తం 10 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు ఎంపీలు కే. కేశవరావు (కేకే), విజయసాయి రెడ్డికి చోటు కల్పించారు.

మరోవైపు హౌజ్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ నియమితులయ్యారు. ఈ కమిటీలో తెలుగు ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్ (టీఆర్ఎస్), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైఎస్సార్సీపీ) సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ హామీల కమిటీకి చైర్మన్‌గా ఎం. తంబిదురై, కమిటీ ఆన్ పేపర్స్ లెయిడ్ ఆన్ ది టేబుల్ కు చైర్మన్‌గా కామాఖ్య ప్రసాద్ తాసా నియమితులయ్యారు.

సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్‌గా డా. లక్ష్మీకాంత్ బాజ్‌పాయిని నియమించగా, ఈ కమిటీలో సభ్యులుగా కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ెస్), ఎస్. నిరంజన్ రెడ్డి (వైఎస్సార్సీపీ), జీవీఎల్ నరసింహారావు (బీజేపీ), తదితరులు సభ్యులుగా ఉన్నారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోనూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చోటు దక్కింది. రూల్స్ కమిటీకి చైర్మన్‌గా హరివంశ్ ఉండగా ఈ కమిటీలో ఎంపీ డా. కే. లక్ష్మణ్‌, బి. పార్థసారథి రెడ్డికి చోటు కల్పించారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement