Monday, May 20, 2024

Smart phones | 57 శాతం పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి

మన దేశం నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి 57 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన ఇవి 78 శాతం పెరిగాయని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) తెలిపింది. దేశ స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో అత్యధికంగా వాటా కలిగిన సామ్‌సంగ్‌ ఎగుమతుల్లోనూ 23 శాతంతో ముందుంది. 16 శాతంతో రెండో స్థానంలో వివో నిలిచింది. 2023 క్యూ 3లో 11 బిలియన్‌ డాలర్ల విలువైన 5జీ స్మార్ట్‌ ఎగుమతులు జరిగాయి. స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు 44 కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. మొత్తం ఫోన్ల మార్కెట్లో స్మార్ట్‌ ఫోన్ల వాటా 57 శాతంగా ఉంది. ఫోల్డబుల్‌ స్మార్ట్‌ పోన్ల వృద్ధి కూడా భారీగా పెరుగుతోంది. 4జీ ఫీచర్‌ ఫోన్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని సీఎంఆర్‌ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మన దేశ స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌ ప్లాట్‌గానే ఉంది. గత సంవత్సరంతో పోల్చితే 1 శాతం అమ్మకాలు తగ్గాయి.

- Advertisement -

పెరిగిన ప్రీమియం ఫోన్ల విక్రయాలు…

దేశీయంగా 7 వేల నుంచి 25 వేల మధ్య ధరలో లభించే ఫోన్ల అమ్మకాలు 69 శాతంగా ఉన్నాయి. ఈ విభాగం అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి 11శాతం తగ్గాయి. 7 వేల రూపాయల లోపు ధరలో లభించే ఫోన్ల అమ్మకాలు 78 శాతంగా ఉన్నాయి. ప్రీమియం సిగ్మెంట్‌లో 25 వేల నుంచి 50వేల రూపాయల ధరలో ఉండే స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు గత సంవత్సరం కంటే 11 శాతం పెరిగాయి.

సూపర్‌ ప్రీమియం సిగ్మెంట్‌గా భావించే 50 వేల నుంచి లక్ష రూపాయల లోపు ధరలో లభించే ఫోన్ల అమ్మకాలు 87 శాతం పెరిగాయి. లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 136 శాతం పెరిగాయి. యాపిల్‌ ఫోన్లు స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో 6 శాతం వాటాను సాధించింది. యాపిల్‌ పాత సీరిస్‌ ఫోన్లపై పలు రకాల డీల్స్‌ ప్రకటించడంతో ఎగుమతులు 44 శాతం పెరిగాయి. గత సంవత్సరం కంటే ఈ త్రైమాసికంలో 4జీ ఫీచర్‌ ఫోన్ల అమ్మకాలు 300 శాతం పెరిగాయి.

ఈ పెరుగుదలకు ప్రధానంగా జియో మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన జియో భారత్‌ కే1 కార్బన్‌ ఫోన్‌, జియో భారత్‌ వీ2 ఫోన్లు. ఈ రెండు ఫోన్లు ఫీచర్‌ ఫోన్ల అమ్మకాల్లో 63 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తంగా చూస్తే గత సంవత్సరం కంటే ఫీచర్‌ ఫోన్ల విక్రయాలు 6 శాతం తగ్గాయి.

2జీ ఫీచర్‌ ఫోన్ల విక్రయాలు 27 శాతం తగ్గాయి. మొత్తం సంవత్సరంలో స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 1-2 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. 2024 మొత్త ం సంవత్సరంలో స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 8-9 పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. 5జీ స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు మాత్రం 40 శాతం పెరుగుతాయని అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement