Sunday, April 28, 2024

రూపీ డీలా, మరోసారి 61 పైసలు పతనం.. డాలర్‌తో మారకం విలువ 83కి చేరిక

విదేశీ మూలధన ప్రవాహాలు, కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలపడిన నేపథ్యంలో ఇండియన్‌ కరెన్సీ మరోసారి క్షీణించింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 61 పైసలు క్షీణించి, 83 బెంచ్‌మార్క్‌ దిగువకు పడిపోయింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం, రిస్క్‌ రహిత సెంటిమెంట్‌కు మదుపరులు మొగ్గుచూపడం మన కరెన్సీపై ప్రభావం చూపాయని ట్రేడర్లు తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ ఉదయం 82.32 వద్ద బలంగా ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత మెల్లగా క్షీణిస్తూ వచ్చింది. ఒక దశలో 83.01 వద్ద జీవితకాల కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో రూపీ మారకం విలువ 10 పైసలు క్షీణించింది. 82.40 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.31 శాతం పెరిగి 112.48కి చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌కు 0.82 శాతం పెరిగి 90.77 డాలర్లకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement