Saturday, May 4, 2024

పూర్తి భారతీయ కంపెనీగా ఫోన్‌ పే.. ఫ్లిప్‌కార్ట్‌తో యాజమాన్య విభజన

వాల్‌మార్ట్‌ కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌ పే యాజమాన్య విభజన పూర్తి చేసింది. సంవత్సరం కాలంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇక నుంచి రెండు సంస్థలు విడివిడిగా తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. విభజన పూర్తి కావడంతో ఇక నుంచి ఫోన్‌ పే పూర్తిగా భారతీయ కంపెనీగా మారుతుంది. ఈ లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌ సింగపూర్‌, ఫోన్‌ పే సింగపూర్‌ వాటాదారులు నేరుగా ఫోన్‌ పే ఇండియాలో నేరుగా వాటాలు కొనుగోలు చేశారని, ఇక నుంచి రెండు సంస్థలు వేరువేరుగా తమ కస్టమర్లకు సేవలు అందిస్తాయని తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాపార వృద్ధి కోసం వేరువేరుగా ప్రణాళికలను రూపొందించుకుంటాయని తెలిపింది.

ఫోన్‌పే వచ్చే సంవత్సరం భారీ ఎత్తున నిదులు సమీకరించాలని భావిస్తోంది. యామాజన్య విభజన వల్ల రెండు కంపెనీల ఎంటర్‌ప్రైజ్‌ విలువ పెరిగి వాటాదారులకు ప్రయోజనం కలుగుతుందని ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌ పే సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అక్టోబర్‌లోనే ఫోన్‌ పే నమోదిత కార్యాలయాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించింది. నిధుల సమీకరణ కోసం ఫోన్‌పే మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో సహా జనరల్‌ అట్లాంటిక్‌ ఇతర వాటాదారులతో చర్చలు జరుపుతున్నది. 700 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్ల వరకు నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఇది పూర్తయితే ఫోన్‌ పే విలువ 12 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో రేజర్‌ పే 7.5 బిలియన్‌ డాలర్లతో అతి పెద్ద ఫిన్‌టెక్‌ కంపెనీగా ఉంది. నిధుల సమీకరణంలో ఫోన్‌ పే విజయం సాధిస్తే, రేజర్‌ పే కంటే పెద్ద సంస్థగా అవతరించనుంది. తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకే ఫోన్‌ పే నిధుల సమీకరణ చేయాలని నిర్ణయిచింది.

గూగుల్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పేకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ పూర్వ ఉద్యోగులు సమీర్‌ నిగమ్‌, రాహుల్‌ చారి, బర్జిన్‌ ఇంజినీర్‌లు ఫోన్‌ పే ను స్థాపించారు. 2016లో ఈ సంస్థను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసింది. 1017లో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ ఇండియా కొనుగోలు చేసింది. దీంతో ఫోన్‌ పే కూడా వాల్‌మార్ట్‌లో భాగమైంది. అమెరికా కంపెనీగా మారింది. తాజాగా యాజమాన్య విభజనతో మళ్లిd పూర్తి భారతీయ కంపెనీగా మారిపోయింది. ఫోన్‌ పే మ్యూచువల్‌ ఫండ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ లైసెనస్‌ల కోసం దరఖాస్తు చేసుకుంది. వెల్త్‌డెస్క్‌, ఓపెన్‌ క్యూ, గిగ్‌ ఇండియా కంపెనీలను ఫోన్‌పే కొనుగోలు చేసింది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ కలిగి ఉంది. ద్విచక్ర వాహనాలు, కార్లకు వాహన బీమా సుదపాయం కూడా కల్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement