Sunday, April 28, 2024

Gold : పసిడి పరుగులు.. 71వేల‌కు చేరిన ధ‌ర‌..

దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. పసిడి ధరలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ జీవితకాల గరిష్టాలకు చేరుకుంటున్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.70వేల 880 వేలకు చేరింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64,973 గా ఉంది. వివాహాల సీజన్‌ కావడం, అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి అనుకూల సంకేతాలు వస్తుండటంతో దేశీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

ఢిల్లీలో పసిడి ధర ఎంతంటే..

ఇక దేశరాజధాని ఢిల్లి లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,610 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.64,820 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,880 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,665 గా ఉంది. పసిడి బాటలోనే వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.81,970 దాటేసింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82,100 ఉండగా, ఢిల్లి లో 81,980, ముంబయిలో 81,910, చెన్నైలో 82,000, బెంగుళూరులో 82,000 వద్ద వెండి ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement