Sunday, May 5, 2024

వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. మీడియం బడ్జెల్ లో మార్కెట్ లోకి

ప్ర‌ముఖ టెక్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ నుండి భార‌త మార్కెట్ లో రిలీజ్ అయిన ఫోన్లు చాలా వరకు సక్సెస్ గా నిలిచాయి. కాగా, ఈ కంపెనీ నుండి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయ్యేందుకు రెడీ గా ఉంది. ఈ ఏడాది వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో పరిచయం చేసిన ‘OnePlus Nord CE 3 5G’ స్మార్ట్‌ఫోన్ ఈ నెల (ఆగస్టు) 4 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ కానుంది. 8GB RAMతో పాటు 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.26,999కు లభిస్తోంది. అలాగే, 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,999గా ఉంది. ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ ఫోన్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది. 12GB వరకు RAMతో పాటు 256GB వరకు స్టోరేజీని ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. ప్రధానంగా, క్వాల్‌కామ్ Snapdragon 782G SoC పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఇది తయారైంది. చిన్నసమస్య కూడా రాకుండా ఒకే సమయంలో 24 అప్లికేషన్ల వరకు వాడొచ్చని వన్‌ప్లస్ తెలిపింది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. 80W SUPER VOOC లైటెనింగ్ ఫాస్ట్ చార్జర్.. స్మార్ట్‌ఫోన్‌ని త్వరగా ఛార్జ్ చేస్తుంది.

ఇక‌ ఈ 5G ఫోన్ ను వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసే ఎర్లీ బయ్యర్స్‌‌కి దాదాపు రూ.2 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. ఐసీఐసీఐ, వన్ కార్డ్ హోల్డర్లు 6 నెలల వ్యవధి లోపు నో కాస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీని వాడుకోవచ్చు.
అలాగే, అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై, క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.2 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement