Thursday, May 16, 2024

Nothing Phone | వచ్చేనెలలో నథింగ్‌ ఫోన్‌ 2ఏ రిలీజ్‌ !

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌ 2ఏను ఫిబ్రవరి నెలాఖరులో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. తొలిసారి మీడియా టెక్‌ డైమెన్సిటీ 7020 చిప్‌ సెట్‌ తో వస్తున్నది. 12 జీబీ ర్యామ్‌ విత్‌ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. 120 హర్జ్ట్‌ రీఫ్రెష్‌ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ నథింగ్‌ ఓఎస్‌ 2.5 ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌పై పని చేస్తుంది.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ డ్యుయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ తో వస్తుంది. 50మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌ కెమెరా, 50మెగా పిక్సెల్‌ ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 16మెెగాక్సెల్స్‌ కెమెరా ఉంటుంది. త్వరలో ప్రారంభమయ్యే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ 2024)లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ ఫోన్‌ ఆవిష్కరిస్తారని చెబుతున్నారు. నథింగ్‌ ఫోన్‌ 2ఏ ఫోన్‌ ఫిబ్రవరి 27న ఆవిష్కరించవచ్చునని తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement