Thursday, May 2, 2024

భారీగా డెలివరీ వర్కర్లను తీసుకుంటున్న.. ఇ-కామర్స్‌ సంస్థలు

రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇ-కామర్స్‌ సంస్థలు పెద్ద సంఖ్యలో డెలివరీ బోయ్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. మార్కెట్‌లో ఈ తరహా కార్మికుల కొరత ఎక్కువగా ఉన్నందున పండుగ సీజన్‌లో వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు పెద్ద సంస్థలన్నీ ఇప్పటి నుంచే డెలివరీ వర్కర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. జులైలో మన దేశంలో నిరుద్యోగం 7 శాతానికి పడిపోయింది. జనవరి తరువాత ఇలా తగ్గడం ఇదే మొదటిసారి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇ-కామర్స్‌ సంస్థలు నియామకాలను వేగంగా పూర్తి చేస్తున్నా యి. దేశంలో గిగ్‌ వర్క్‌ఫోర్స్‌కు డిమాండ్‌ బాగా పెరిగిందని, దీనికి అనుగుణంగా ఈ తరహా వర్కర్ల అందుబాటు మాత్రం డిమాండ్‌కు తగిన విధంగా పెరగలేదని బిగ్‌ బాస్కెట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ టీకే బాలకుమార్‌ అభిప్రాయపడ్డారు. మా ర్చితో ముగిసిన త్రైమాసికంలో బిగ్‌ బాస్కెట్‌ సంస్థలో డెలివరీ వర్కర్లు కేవలం 500 మంది మాత్రమే ఉండేవారు.

జూన్‌ త్రైమాసికం వచ్చే సరికి సంస్థ 2,200 మంది డెలివరీ వర్కర్లను తీసుకుంది. మార్చి 2023 నాటికి ఈ సంఖ్యను 6 వేలకు పెంచా లని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మరో ఇ-కామర్స్‌ సంస్థ డంజో కూడా డెలివరీ వర్కర్ల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం మన దేశంలో 2019-20 సంవత్సరంలో గిగ్‌ వర్కర్లు 45 శాతం ఉంటే, ఈ సంఖ్య 2022-23 నాటికి 9.9 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది. డెలివరీ, సెల్స్‌ ఉద్యోగాలు చేసే వారు ఇతర రంగాల్లోకి పోతుంటారని, దీని వల్ల ఈ మార్కెట్‌లో కొరత ఎప్పడూ ఉంటూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మా ర్కెట్‌లో డెలివరీ వర్కర్ల కొరత తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని, వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో సరఫరా డిమాండ్‌ల మధ్య సమతౌల్యం వస్తుందని భావిస్తున్నట్లు డంజో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కబీర్‌ బిస్వాస్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement