Sunday, April 28, 2024

మూడు రోజుల్లో మార్కెట్లు డౌన్ ట్రేడ్.. 2శాతం మేర నష్టం..

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. మూడు రోజులు మాత్రమే మార్కెట్‌ కొనసాగింది. విదేశీ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు దాదాపు 2 శాతం మేర నష్టపోయాయి. మూడు రోజులే ట్రేడింగ్‌ జరగ్గా.. ఆ మూడు రోజుల కూడా నష్టాలే వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు భారీగా పెరుగుతాయన్న భయాల కారణంగా స్టాక్‌ మార్కెట్‌లో ఈ వారం పతనం కనిపించింది. ఈ వారం స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో తక్కువ నష్టాలు వచ్చాయి. అదే సమయంలో జెయింట్‌ స్టాక్‌ల కంటే మిడ్‌ క్యాప్‌ స్టాక్‌ల నష్టం ఎక్కువగా ఉంది. మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1100 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు (1.73 శాతం) నష్టపోయింది. ఏప్రిల్‌ 13న చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 58,338, నిఫ్టీ 17,475 పాయింట్ల వద్ద ముగిశాయి.

పవర్‌ రంగంలో అత్యధిక లాభాలు..

ఈ వారంలో అత్యధిక లాభాలు పవర్‌ రంగంలో వచ్చాయి. బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ 5 శాతానికిపైగా లాభపడింది. బీఎస్‌ఈ ఐటీ సెక్టార్‌ ఇండెక్స్‌ 3 శాతం, బీఎస్‌ఈ టెలికాం సెక్టార్‌ 3 శాతం నష్టాలను మూటగట్టుకుంది. మెటల్‌ సెక్టార్‌ 2 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 2 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ వారంలో 2.6 శాతం పడిపోయింది. లార్జ్‌ క్యాప్‌ 1.3 శాతం పడిపోగా.. స్మాల్‌ క్యాప్‌ స్టాక్‌ 0.80 శాతం నష్టపోయింది. మూడు రోజుల్లో ఎఫ్‌ఐఐలు రూ.6,000 కోట్లకు పైగా ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం రూ.1,800 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐలు రూ.10,700 కోట్లు విక్రయాలు జరపగా.. డీఐఐలు రూ.5,800 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement