Wednesday, May 1, 2024

13 నెలల గరిష్టానికి తయారీ రంగం…

డిసెంబర్‌లో తయారీ రంగం కార్యకలపాలు 13 నెలల గరిష్టానికి చేరాయి. అధిక డిమాండ్‌, కొత్త వ్యాపారాల రాక అందుకు దోహదం చేసిందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇండియా నెలవారీ నివేదికలో తెలిపింది. తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ గత నెలలో 57.8 శాతం నమోదైంది. క్రితం నెల ఇది 55.7 శాతంగా ఉంది. గత రెండేళ్ల వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా పుంజుకున్నాయని తెలిపింది. పీఎంఐ సూచీ 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగా, అంతకంటే తక్కువగా నమోదైదే క్షీణతగా పరిగణిస్తారు. 2022 ని ఆశాజనంగా ప్రారంభించిన తయారీ రంగం ఏడాదంతా బలమైన ఫలితాలను కనబరిచింది.

2021 నవంబర్‌ నుంచిప్రారంభమైన తయారీ కార్యకలాపాల విస్తరణ సంవత్సరం పొడవునా కొనసాగించి అంతే బలంగా ఈ ఏడాదిని ముగించిందని ఎన్‌ అండ్‌ పీ ప్రతినిధి తెలిపారు. డిసెంబర్‌లోనూ తయారీ రంగంలో ఉద్యోగ నియామకాలు పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తి పెంచిన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. డిమాండ్‌ పెరగడంతో అమ్మకాలు కూడా పెరిగాయి. అనుకూల పరిస్థితులు, ఉత్పత్తుల అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసిందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో నెలకొన్న సమస్యలు తగ్గడం కూడా కలిసొచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement