Sunday, May 12, 2024

ఈవీ మార్కెట్లోకి లగ్జరీ కార్లు

దేశంలో ఎలక్ట్రికల్‌ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. వినియోగదారులు ఈవీ కార్లను ఇష్టపడుతున్నారు. రోజు రోజుకు పెట్రోల్‌ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు పెట్రోల్‌ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్‌ కార్లపై మొగ్గు చూపుతున్నారు. క్రమంగా మార్కెట్‌ పెరుగుతుండటంతో లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు ఈవీ మార్కెట్‌ పై దృష్టి సారించాయి. లగ్జరీ హై ఎండ్‌ కార్ల తమారీ సంస్థలు తమ ఈవీ మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి.

మార్కెట్లోకి ఈవీ లగ్జరీ కార్లు..

ఈవీ మార్కెట్‌లో లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, జగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌, వోల్వో తమ ఎలక్ట్రికల్‌ కార్లను విడుదల చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానున్న ఈ లగ్జరీ ఈవీ కార్ల ధరలు 60 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉండనున్నాయి. లోకల్‌గానే వీటిని తయారు చేయడం ద్వారా ధరలు అందుబాటులోకి తీసుకు వచ్చి, ఎక్కువ మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోవాలని ఈ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కంపెనీలు మార్కెట్‌లోకి తీసుకు వస్తున్న ఈవీ కార్లు ఒక్క ఛార్జింగ్‌తో 250 నుంచి 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలవని ప్రకటిస్తున్నాయి.

భారీగా పెరుగుతున్న అమ్మకాలు

కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న ప్రోత్సహకాలు, వినియోగ దారుల అభిరుచిలో వచ్చిన మార్పుల వల్ల ఈవీ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగు తున్నాయని వాహన రంగ నిపుణులు అంచనా వేశారు. 2020లో 12,311 ఈవీ కార్ల అమ్మకాలు జరిగితే 2021లో ఈ సంఖ్య రెట్టింపై 14,880కి చేరుకుంది. లోకల్‌ మార్కెట్‌లో ప్రధానంగా టాటా కంపెనీకి చెందిన పలు ఈవీ మోడళ్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. హుండాయ్‌ కంపెనీకి చెందిన కోనా ఈవీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మరిన్న మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తన్నట్లు ఈ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. వీటితో పాటు త్వరలోనే మారుతి సుజికీ కూడా తన ఈవీ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మహేంద్ర అండ్‌ మహేంద్ర కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ప్లాగ్‌షిప్‌ బ్రాండ్‌గా ఉన్న ఎక్స్‌యూవీ 300 మోడల్‌ ఈవీ కారును త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. మన దేశ మార్కెట్‌లో ఒక వైపు లగ్జరీ కార్లతో పాటు, 25 లక్షల లోపు ధరలో, ఒక సారి ఛార్జ్‌ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించే మోడళ్ల కార్లు మార్కెట్ల్‌లోకి రానున్నాయి.

- Advertisement -

మన దేశ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈవీ లగ్జరీ కార్లు

1) మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ ధర 2కోట్లు
2) వొల్వో ఎక్స్‌సి 40 ధర 70 లక్షలు
3) హుండయ్‌ లొంక్వీ 5 ధర 60 లక్షలు
4) కియా ఈవీ6 ధర 59.99 లక్షలు
5) ఆడీ ఈ-టర్న్‌ ధర 1.19 కోట్లు
6) బిఎండబ్ల్యూ ఐఎక్స్‌ ధర 1.1 కోట్లు
7) జగ్వార్‌ ఐ-పేస్‌ ధర 1.17 కోట్లు
8) మెర్సిడెస్‌ ఈక్యూసీ ధర 99 ల క్షలు
9) బిఎండబ్ల్యూ మినీ ధర 48 లక్షలు
10) బిఎండబ్ల్యూ ఐ4 ధర 69 లక్షలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement