Saturday, May 4, 2024

భారత్‌ వృద్ధి రేటు అంచనాలు సవరణ.. 8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింపు

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసుపై ప్రభావం పడటం వంటి అంశాలు ఉన్నాయని వివరించింది. చమురు, ఎడిబుల్‌ ఆయిల్స్‌ ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్టు తెలిపింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భారత్‌ జీడీపీపై పడుతుందని హెచ్చరించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. గత అంచనాల నుంచి ఈ రేటులో 0.8 శాతం మేర కోత విధించింది.

యుద్ధ ప్రభావంతో కమోడిటీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు తలెత్తడం వంటి అంశాల కారణంగా వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఇక్రా చీఫ్‌ ఎకనామిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. వచ్చే ఏప్రిల్‌ నెల తొలి నాళ్లలో జరిగే ఆర్బీఐ తదుపరి సమీక్షా సమావేశంలో గతంలో అంచనా వేసిన వృద్ధి రేటును సవరించే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పర్యాటక ప్రాంతాలకు దూరంగా ఉన్న అధిక ఆదాయ వర్గాలు ఇక నుంచి టూరిజం స్థలాలను సందర్శించే అవకాశం ఉందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement