Monday, April 29, 2024

ఎంట్రెన్స్, స్కాలర్ షిప్ టెస్ట్ లు ఏవీ నిర్వహించొద్దు.. అట్ల చేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం

చిత్తూరు కార్పొరేషన్, (ప్రభ న్యూస్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు డీఈవో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఏ స్కూల్‌లో అయినా ఎంట్రెన్స్ టెస్టు, స్కాల‌ర్ షిప్ టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు తెలిసిందో ఆ స్కూల్ రిక‌గ్నేష‌న్ ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. జిల్లాలో ఏ పాఠశాల అయినా ఎంట్రన్స్ టెస్ట్ , స్కాలర్ షిప్ టెస్ట్ ల పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే సంబంధిత పాఠశాల ప్రభుత్వ గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ హెచ్చరించారు. రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ ఆదేశాల మేరకు రానున్న కొత్త విద్యా సంస్థలు పురస్కరించుకుని జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఎవరైనా ఎంట్రన్స్ టెస్ట్ లో పేరుతో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ మేరకు బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ విలేకరులతో మాట్లాడారు. ఏ పాఠశాల అయిన టాలెంట్ టెస్ట్ , ఎంట్రన్స్ టెస్ట్ , స్కాలర్ షిప్ టెస్ట్ వంటి పేర్లతో ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంబంధిత పాఠశాల ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలు
టాలెంట్ టెస్ట్ , ఎంట్రన్స్ టెస్ట్ , స్కాలర్ షిప్ టెస్ట్ వంటి పేర్లతో ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించరాదని డీఈఓ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement