Sunday, April 28, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌కు ఫుల్ డిమాండ్‌..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో డిమాండ్‌ భారీగా పెరిగింది. 2008లో ఈ మోడల్‌ను మరోసారి లాంఛ్‌ చేసినప్పటి నుంచి ఇండియన్‌ బైకర్స్‌ను ఇది విపరీతంగా ఆకర్షిస్తోంది. క్లాసిక్‌ 350 బైక్‌ను 1948 నాటి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోడల్‌2ను ప్రేరణగా తీసుకొని రూపొందించారు. ఇది స్వింగింగ్‌ ఆర్మ్‌ రియర్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రొడక్షన్‌ మోటార్‌సైకిల్‌. బైక్‌ డిజైన్‌, పనితీరు పరంగా ఎన్ని మార్పులు వచ్చినా ఇండియన్‌ మార్కెట్‌లో దీనికి ఉన్న ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. ఫిబ్రవరి 2022 సేల్స్‌ గణాంకాల ప్రకారం బైక్‌ సేల్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 టాప్‌ ప్లేస్‌లో ఉంది. క్లాసిక్‌ తర్వాత బుల్లెట్‌ 350, కొత్త మెటోర్‌ 350 లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. క్లాసిక్‌ బైక్‌లో మార్పులను తీసుకువచ్చిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో సరికొత్త క్లాసిక్‌ 350 బైక్‌ను విడుదల చేసింది.

కాగా కొత్త క్లాసిక్‌ 350 బైక్‌ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ను రెడ్‌డిచ్‌ సిరీస్‌, హాల్‌సియోన్‌ సిరీస్‌, క్లాసిక్‌ సిగ్నల్స్‌, డార్క్‌ సిరీస్‌, క్రోమ్‌ సిరీస్‌లలో అందిస్తుంది. రెెడ్‌డిచ్‌ సిరీస్‌ మోడల్‌ ఎంట్రీ లెవల్‌ క్లాసిక్‌ 350. దీనికి రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు. హోల్‌సియోన్‌ మోడల్‌ ధర రూ. 1.93 లక్షలు. సిగ్నల్స్‌ వేరియంట్‌ ధర రూ. 2.04 లక్షలు. అల్లాయ్‌ వీల్స్‌తో కూడిన డార్క్‌ సిరీస్‌ మోడల్‌ ధర రూ. 2.11 లక్షలు. టాప్‌ క్రోమ్‌ సిరీస్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 2.18 లక్షలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement