Friday, April 26, 2024

సినీఫక్కీలో దొంగతనం, గన్‌తో బెదిరించి బ్యాంకులో నగదు చోరీ

కశింకోట, (అనకాపల్లి) ప్రభ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన‌కాప‌ల్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సినీ ఫ‌క్కీలో చోరీ చేశారు దుండ‌గులు. బ్యాంకులో గ‌న్‌తో బెదిరించి న‌గ‌దు దోచుకేళ్లారు. క‌శింకోట‌ మండలంలోని నర్సింగిబిల్లి గ్రామంలో ఒక వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు లోకి వచ్చి తుపాకీతో బ్యాంకులో ఉన్న క్యాషియర్‌(వి. ప్రతాప్‌ రెడ్డి)ను బెదిరించి క్యాష్‌ కౌంటర్‌ లో ఉన్న 3.31లక్ష‌లు దోపిడీ చేశాడు. దొంగతనంచేసిన వ్యక్తి నలుపు రంగు హెల్మెట్‌, నేవీ బ్లూ కలర్‌ జాకెట్‌, జీన్స్‌ ప్యాంటు, షూస్‌ ధరించి ఉన్నాడు.

అతను సేఫ్ ఖోలో, చాబి కిదర్‌ హై అని హిందీ లో మాట్లాడినట్లు చెప్పారు. ఆసమయంలో సిబ్బంది ముగ్గురే ఉన్నారు. ఈమేరకు క్లూస్‌ టీ-మ్‌ వెనిముద్ద్రలు సేకరించింది. పోలీసులు జరిగిన ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దొంగ ఆధారాల కోసం ప‌రిశీలిస్తున్నారు. నక్కపల్లి టోల్‌ ప్లాజా సీసి పుటేజ్‌ పరిశీలించడానికి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement