Wednesday, May 1, 2024

నల్లమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. 300 అడుగుల లోతులో పడ్డ మినీ లారీ

న‌ల్ల‌మ‌ల అడ‌విలో ఇవ్వాల సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. న‌ర‌సారావుపేట నుంచి గుంత‌క‌ల్ వెళ్తున్న ఓ మినీ లారీ ప్ర‌మాద‌వ‌శాత్తు 300 అడుగుల లోతున్న లోయ‌లోకి జారిపోయింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ ముర‌ళికృష్ణ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. ద‌ట్ట‌మైన అడ‌వి కావ‌డం.. పైగా 300 అడుగుల లోతులో ప‌డిపోవ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు చాలా ఆల‌స్య‌మైంది.

డ్రైవ‌ర్ డెడ్‌బాడీని బ‌య‌టికి తీసేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆత్మ‌కూరు పోలీసులు ప్ర‌త్యేక రోప్ స‌హాయంతో దాదాపు ఆరు గంట‌ల‌పాటు శ్ర‌మించి మృత‌దేహాన్ని బ‌య‌టికి తీశారు. ఈ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఎస్సై హ‌రిప్ర‌సాద్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement