Monday, April 29, 2024

ట్విటర్‌తో ఉద్యోగుల తొలగింపు షూరు..

ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సీఈఓ, సీఎఫ్‌ఓ, లీగల్‌ హెడ్‌తో పాటు పలువురు కీలక పదువుల్లో ఉన్న వారికి తొలగించారు. తాజాగా ఉద్యోగుల సంఖ్యను కుదించాలని నిర్ణయించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. శనివారం నుంచే మస్క్‌ ఉద్యోగుల కుదింపుపై చర్యలు ప్రారంభించారు. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితా రూపొందించాల్సిందిగా మేనేజర్లను ఆయన ఆదేశించారు. విభాగాలను బట్టి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఓ కీలక ఉద్యోగి వెల్లడించారు. అవసరాల ప్రతిపాదికన ఉద్యోగులను విభాగాల వారిగా తొలగించనున్నారు. నవంబర్‌ 1లోగానే చాలా మందిని తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 1వ తేదీ న ఉద్యోగులు స్టాక్‌ గ్రాంట్స్‌ అందుకోనున్నారు. ఈ లోగానే తొలగిస్తే, వారికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. డీల్‌ కుదరిన నాటి నుంచే ఉద్యోగుల సంఖ్యను కుదించాల్సిన అవసరం ఉందని మస్క్‌ చెబుతున్నారు.

ట్విటర్‌ కంటెంట్‌పరమైన విధానాలకు సంబంధించి ఓ మండలిని ఏర్పాటు చేస్తామని మస్క్‌ ప్రకటించారు. కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు తరువాతే విధానాల్లో మార్పుులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కంటెంట్‌ మార్పులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కొంతమంది ప్రముఖుల ఖాతాల్ని పునరుద్ధరించడంపై కూడా మండలి ఏర్పాటు తరువాతే నిర్ణయం తీసుకుంటామని మస్క్‌ తెలిపారు. క్యాపిటల్‌ హిల్‌పై దాడి తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్ ఖాతాను రద్దు చేశారు. ఇలాంటి ఖాతాలు చాలానే ఉన్నాయి. ప్రముఖుల ఖాతాలను ఎలాన్‌ మస్క్‌ పునరుద్ధరించాలని నిర్ణయించారని ఇటీవల వార్తలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement