Wednesday, May 15, 2024

Business | మ‌రో అంత‌ర్జాతీయ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌‌గా దీపిక

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిల్టన్ హోటల్స్ కు గ్లోబల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఎంపికైంది. ఈ విషయాన్ని హిల్టన్ హోటల్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఇక నుంచి అమెరికా మల్టీనేషనల్ హాస్పిటాలిటీ కంపెనీ హిల్టన్‌ను దీపిక ప్రమోట్ చేయనున్నట్టు తెలిపింది. హిల్టన్ కంపెనీ భారతదేశంలో 17 హోటళ్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.

ఇక, దీపికా పదుకొణె ఇప్ప‌టికే పలు అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. కార్టియర్, లూయిస్ విట్టన్ లాంటి ఐకానిక్ డిజైనర్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఆగస్టు 2023 నుంచి UK-ఆధారిత డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ అంబాసిడర్‌గానూ కొనసాగుతోంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ సంస్థకు కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అయితే హ్యుందాయ్ మోటార్‌ ఇండియాకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. షారుక్‌ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి కార్ల తయారీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారిలో రెండో వ్యక్తిగా దీపికా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement