Monday, April 29, 2024

డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ ఐపీఓ రూ.600 కోట్ల సమీకరణ.. రక్షణ రంగంలో వేగంగా వృద్ధి

న్యూఢిల్లి : భారతీయ రక్షణ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా పేరొందిన డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌.. తమ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీకు సమర్పించింది. ఎలక్ట్రానిక్‌ సబ్‌ సిస్టమ్స్‌, కేబుల్‌ హార్నెస్‌ల తయారీలో డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాధించుకుంది. దేశంలోనే సుప్రసిద్ధ కంపెనీగా నిలుస్తున్నది. ఈ ఐపీఓ ద్వారా.. రూ.600 కోట్లు సమీకరించేందుకు డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా సేవలు అందిస్తున్న డీసీఎక్స్‌ సిస్టమ్స్‌లో తాజాగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా.. మరో రూ.100 కోట్ల షేర్లను ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లకు విక్రయించనున్నారు.

రుణాల చెల్లింపులపై దృష్టి..

ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాలను కంపెనీ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు మూలధన అవసరాల కోసం వినియోగించనున్నారు. వీటితో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలు తదితరాల కోసం ఉపయోగించుకోనున్నారు. ఈ ఐపీఓలో భాగంగా విక్రయించే ఈక్విటీ షేర్లలో ఎన్‌సీబీఐ హోల్డింగ్స్‌ ఇంక్‌ రూ.50 కోట్లు, వీఎన్‌జీ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 కోట్లు విలువ కలిగిన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి. ఈ ఆఫర్‌కు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఎడెల్‌వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, సఫ్రాన్‌ క్యాపిటల్‌ ఎడైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహరించనున్నాయి. ఈ ఈకిటీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టింగ్‌ చేయడానికి ప్రతిపాదించారు. డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌.. తమ కార్యకలాపాల ద్వారా సీఏజీఆర్‌ వద్ద 46.22 శాతం ఆదాయం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.299.87 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.641.16 కోట్లు, 2021 డిసెంబర్‌ 31తో ముగిసిన 9 నెలల కాలంలో రూ.728.23 కోట్ల ఆదాయం గడించింది.

ఓఈఎం, ఐఓపీ భాగస్వామి..

కంపెనీ ఆర్డర్‌ బుక్‌ మార్చి 31, 2019 నాటికి ఉన్న రూ.1042.30 కోట్ల నుంచి 2022, మార్చి 31, 2021 నాటికి రూ.2855.01 కోట్లకు పెరిగింది. ఫిబ్రవరి 28, 2022 నాటికి డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ ఆర్డర్‌ బుక్‌ రూ.2,499.29 కోట్లను 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలి. డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ 2019లో కార్యకలాపాలను ప్రారంభించింది. రక్షణ తయారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. విదేశీ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారుల (ఓఈఎంలు) కోసం భారతీయ ఆఫ్‌సెట్‌ భాగస్వామి (ఐఓపీ)గా ఉంది. ఎల్టా సిస్టమ్స్‌ లిమిటెడ్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, సిస్టమ్‌ మిస్సైల్స్‌ అండ్‌ స్పేస్‌ డివిజన్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ఆస్ట్రా రాఫెల్‌ కామ్‌సిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆల్ఫా ఎల్సెక్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీ, ఎస్‌ఎఫ్‌ఓ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement