Friday, April 26, 2024

వరుసగా రెండో రోజు మార్కెట్ల జోరు..

స్టాక్ మార్కట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెన్స్‌ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద నిలిచింది.

ఇక స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నేడే తొలిసారి నమోదైన జొమాటో షేర్లు దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా.. దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. చివరకు 66 శాతం లాభంతో రూ.126 వద్ద స్థిరపడింది. లిస్టయిన తొలిరోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1 లక్ష కోట్లకు చేరుకోవడం విశేషం. మార్కెట్‌ విలువ ఆధారంగా బీఎస్‌ఈ టాప్‌ 50 జాబితాలోకి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.18%), ఐటీసీ లిమిటెడ్ (2.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), యాక్సిస్ బ్యాంక్ (1.27%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.82%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.74%), ఎన్టీపీసీ (-0.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%), ఏసియన్ పెయింట్స్ (-0.54%).

Advertisement

తాజా వార్తలు

Advertisement