Sunday, May 5, 2024

షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ప్రైవేటీకరణకు బిడ్లు

ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 65 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం , అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ఎల్‌ఐసీ లో వాటాల విక్రయానికి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 24 వేల కోట్లు సమకూర్చుకుంది. డిసెంబర్‌ త్రైమాసికంలో బీఈఎంఎల్‌లోనూ వాటాల విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) ప్రయివేటీకరణకు బిడ్లు అహ్వానించనుంది. మార్చిలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఒక ఉన్నాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే షిప్పింగ్‌ కార్పొరేషన్‌ భూములు, అప్రధాన ఆస్తులను ఎస్‌సీఐ ల్యాండ్‌ అండ్‌ అసెట్స్‌ లిమిటెడ్‌కు బదలాయించే ప్రక్రియ తుదిదశలో ఉందని ఆ అధికారి వెల్లడించారు.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. బదలాయింపు పూర్తయిన వెంటనే ప్రయివేటకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్పుడు ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించనుంది. 2022, మార్చి 31 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో సంస్థ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం అప్రధాన ఆస్తుల విలువ 2,392 కోట్లు. ఎస్‌సీఐలో 63.75 శాతం వాటాల విక్రయానికి 2020 మార్చిలో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. పలువురు టెండర్లు వేసినప్పటికీ, ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ఆలస్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement