Friday, May 3, 2024

HYD: బీఎఫ్ఎస్ఐ కాన్ క్లేవ్ 2023 : సమ్మిళిత వృద్ధి కోసం ఆవిష్కరణలు

హైదరాబాద్ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ), హైదరాబాద్, బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం సహకారంతో ఇన్‌క్లూజివ్ గ్రోత్ కోసం ఇన్నోవేషన్స్ అనే నేపథ్యంతో బీఎఫ్ఎస్ఐ కాన్‌క్లేవ్ మొదటి ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (మనీలా), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ, బంధన్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సక్‌సీడ్ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతినిధులతో సహా ప్రముఖ వక్తలు, ప్రతినిధులు తమ పరిజ్ఞానం, వ్యూహాలను మార్పిడి చేసుకోవడానికి సమావేశమయ్యారు. ఐఎంటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష రెడ్డి కె, ఐఎంటీ తరపున అందరికీ స్వాగతం పలికారు. రాజేష్ బాలరాజు, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, కోర్ గ్రూప్ సభ్యుడు బీఎఫ్ఎస్ఐ కాన్ క్లేవ్, అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు.

ఐఎంటీ హైదరాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ కాన్‌క్లేవ్ చైర్ ప్రొఫెసర్ (డా) శరత్ బాబు, సమ్మేళనం థీమ్ – ఇన్‌క్లూజివ్ గ్రోత్ కోసం ఆవిష్కరణలు గురించి చర్చించారు. డిజిటల్‌ ఫైనాన్స్‌ వల్ల క్రెడిట్‌ తీసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. మనీలాలోని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్టార్ స్పెషలిస్ట్ అరూప్ ఛటర్జీ- ఫైనాన్షియల్ మార్కెట్‌లు, ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వాతావరణ చర్యలను ఏకీకృతం చేయడం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఐఎంటీ హైదరాబాద్‌లోని అకడమిక్స్ డీన్, వీసీ ప్రొఫెసర్ (డా) చక్రపాణి, ఉత్సాహ పూరితమైన ఫైర్‌సైడ్ చాట్‌ను నిర్వహించారు. అతిథి డాక్టర్.సుభాష్ చంద్ర ఖుంటియా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఛైర్మన్, మాజీ ఐఆర్డీఏఐ ఛైర్మన్‌తో కలిసి చేసిన ఈ సంభాషణ గ్రామీణ, పట్టణ భారతదేశంలో బీమా వ్యాప్తి గురించి తగిన అవగాహన అందించింది. అలాగే బంధన్ బ్యాంక్ కు సంబంధించి పలువురు ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement