Sunday, April 28, 2024

మంచి వృద్ధిరేటు నవెూదు చేసిన బంధన్‌ బ్యాంక్.. వెల్లడించిన ఎండీ ఘోష్

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : సమ్మిళిత బ్యాంకింగ్‌తో కీలకంగా ఎదుగుతు న్న యూనివర్శిల్‌ బ్యాంక్‌ బంధన్‌ తమ 2021-22 నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితా లను వెల్లడించింది. ఈ ఫలితాలను గురించి బ్యాంక్‌ ఎండీఅండ్‌సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. 2022 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసంలో శక్తివంతమైన ప్రదర్శన బ్యాంక్‌ మరోమారు నిలకడ ప్రదర్శించిందన్నారు. ఈ బ్యాంక్‌ యొక్క మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, అడ్వాన్స్‌లు) 18.6శాతం, ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధి చెంది మార్చి 31, 2022 నాటికి 1.96 లక్షల కోట్లకు చేరాయని, ఈ బ్యాంక్‌ 2.63 కోట్ల వినియోగదారులను 5639 బ్యాంక్‌ శాఖల ద్వారా చేరుకుందని తెలిపారు. బ్యాంకుకు భారతదేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 34 బ్యాంకింగ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయని వివరించారు. బంధన్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 60,211కి చేరిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసంలో బ్యాంక్‌ డిపాజిట్లు గత సంవత్సరం ఇదే త్రైమాసంతో పోలిస్తే 24శాతం వృద్ధి చెందాయని, మొత్తం డిపాజిట్లు ఇప్పుడు 96,331 కోట్లకు చేరాయన్నారు.

ఈ కాలంలో బ్యాంక్‌ రిటైల్‌ డిపాజిట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంతో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 21శాతంపెరిగి, 74,441 కోట్లకు చేరిందని తెలిపారు. కరెంట్‌ ఎకౌంట్‌ అండ్‌ సేవింగ్స్‌ఖాతా(కాసా) బుక్‌ ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 18శాతం వృద్ధి నమోదు చేసిందని, కాసా రేషియో ఇప్పుడు మొత్తం డిపాజిట్‌ బుక్‌లో 41.6 శాతంగా ఉందన్నారు. అడ్వాన్స్‌ల పరంగా చూస్తే బ్యాంక్‌ 16శాతం వృద్ధి నమోదు చేసిందని, మొత్తం ఆదాయం 99,338 కోట్లకు చేరిందన్నారు. క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో(సీఏఆర్‌) 20.1శాతం బ్యాంక్‌ స్థిరత్వానికి సూచికగా ఉంటుందని తెలిపారు. తమ వ్యాపార నమూనా పట్ల నమ్మకం మరింతగా బలోపేతమైందన్నారు. వినియోగదారుల నిరంతర మద్దతు, నమ్మకం పట్ల ధన్యవాదములు తెలిపిన ఆయన కోట్లాది మంది భారతీయుల ప్రాధాన్యత బ్యాంకింగ్‌ భాగస్వామిగా బంధన్‌ బ్యాంక్‌ను నిలిపిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement