Saturday, April 27, 2024

2.3శాతం తగ్గిన ఎటిఎఫ్‌ ధరలు

దేశీయ చమురు సంస్థలు విమాన ఇంధన ధరల్ని కాస్తంత తగ్గింతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో, విమాన ఇంధన ధరలను 2.3శాతం తగ్గించాయి. అయితే పెట్రోల్‌, డీజెల్‌తోపాటు వంటగ్యాస్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా సవరణతో విమాన ఇంధనం ధర కిలో లీటర్‌పై రూ.2,775 తగ్గింది. తద్వారా రూ.1,17,587కి చేరింది. ఇది విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే అంశం. విమానయాన సంస్థల నిర్వహణలో 40శాతం వ్యయం ఇంధన ఖర్చే ఉంటోంది.

గతనెల కూడా కిలోలీటర్‌ ఎటిఎఫ్‌ ధర రూ.4,842 తగ్గింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, దేశీయ మారక రేట్లకు అనుగుణంగా ఎటిఎఫ్‌ ధరల్ని ప్రతినెలా ఒకటో తేదీన చమురు సంస్థలు తగ్గిస్తుంటాయి. తాజా సవరణలో పెట్రోల్‌, డీజెల్‌ ధరలను మాత్రం యదాతథంగా ఉంచడం జరిగింది. వరుసగా ఎనిమిది నెలల నుంచి ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement